Lok sabha elections 2024: కేరళలో బోణి కొట్టనున్న బీజేపీ

-

దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.లోక్ సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది. ఇక యూడీఎఫ్ 13 నుంచి 15 స్థానాల్లో ,ఎల్‌డీఎఫ్ 3 నుంచి 5 స్థానాల్లో గెలవనుంది. ఏప్రిల్ 26వ తేదీన కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో పోలింగ్‌ జరిగినా విషయం తెలిసిందే. కాగా, జూన్ 4న అధికారిక ఫలితాలు వెలువడుతాయి.

కేరళలో రాజకీయ పార్టీలు 3 వర్గాలుగా ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం) తోపాటు రివెల్యూషన్ సోషలిస్ట్ ,యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రెంట్‌ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. ఇక లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రెంట్ నాయకత్వం కింద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం)లు ఉన్నాయి. మూడో రాజకీయ పార్టీగా బీజేపీ, భారత ధర్మ జనసేనతోపాటు కేరళ కాంగ్రెస్ (థామస్) ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news