అరుణాచల్ మళ్లీ బీజేపీదే.. సిక్కింలో SKM క్లీన్ స్వీప్

-

ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతి కారీ మోర్చా-SKM దూసుకుపోయింది. సిక్కింలోని మొత్తం ఆరు జిల్లాలకు చెందిన ఓట్లు ఒకే చోట లెక్కించారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించారు. తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను గణిస్తున్నారు.

మరోవైపు అరుణాచల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి విజయం ఢంకా మోగించింది. 60 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు గెలిచింది. మరో 14 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇంకోవైపు సిక్కింలో ఎస్కేఎమ్ పార్టీ మరో సారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు సాధించింది. మొత్తం 32 స్థానాల్లో 18 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ 17ను దాటింది. మరో 13 సీట్లలో లీడ్లో ఉంది. సిక్కిం సీఎం, ఎస్‌కేఎమ్ అధినేత పిఎస్ తమంగ్, రెనాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్‌డీఎఫ్‌కు చెందిన సోమ్ నాథ్ పౌడియాల్‌పై 7,044 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news