ఇప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ కు 105 సీట్లు వస్తాయంటున్నారు: కేసీఆర్

-

బీఆర్ఎస్ను మహావృక్షం, మహాసముద్రంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు సహజంగా నైరాశ్యం వస్తుంది. కానీ తర్వాత నేను బస్సు యాత్ర మొదలుపెడితే మళ్లీ అదే గర్జన కనిపించింది అని తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎన్నికలొస్తే 105 సీట్లు గెలుస్తామని చెప్పాడు. మనం డంబాచారాలు చెప్పలేదు. PR స్టంట్లు చేయలేదు. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే’ అని కేసీఆర్ తెలిపారు.

ఇక నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కేసీఆర్ స్పందించారు.లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లయినా రావొచ్చని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. లోకసభ సీట్లలో ఎన్ని వస్తాయో చూద్దాం. ఒకడు మనకు 11 వస్తాయన్నాడు. ఇంకొకడు ఒకటే వస్తదన్నాడు. మరొకడు 2-4 అన్నాడు. ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయింది. మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. 11 వస్తే పొంగిపోయేది లేదు. 2 వస్తే కుంగిపోయేది లేదు’ అని తెలిపారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news