మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోయారు. స్థానిక కోర్టు కేజ్రీవాల్ ను జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.మధ్యంతర బెయిల్ జూన్ 1 న ముగియడంతో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లారు.
ఈడీ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ పిటిషన్ ను దాఖలు చేసింది. అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై ఉన్నందున దరఖాస్తు పెండింగ్ లో ఉంది. కేజ్రీవాల్ లొంగిపోయిన తర్వాత స్థానిక రాస్ అవెన్యూ కోర్టు డ్యూటీ జడ్జీ దరఖాస్తును స్వీకరించి జూన్ 5 వరకు జ్యుడిషయల్ కస్టడీకి పంపారు. జైలులో లొంగిపోయే ముందు రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు అరవింద్ కేజ్రివాల్. అనంతరం కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు.