ఈ వారం థియేటర్‌లో అలరించే సినిమాలు ఇవే

-

గత మూడు నెలలుగా థియేటర్ల వద్ద చిన్న చిత్రాల సందడే కొనసాగుతోంది. అలాగే మే నెల కూడా చిన్న సినిమాలతోనే ముగిసింది. ఇక జూన్లోనైనా భారీ బడ్జెట్ చిత్రాలు వస్తాయని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈనెలలో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి. ఈ మాన్సూన్ ప్రేక్షకులకు ఎలా స్వాగతం పలకబోతోంది ఓసారి చూద్దామా?

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ నటించిన తాజా చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. కుటుంబంతో కలిసి ఈ చిత్రానికి వెళ్తే మూడు తరాల వాళ్లు ఈ కథతో కనెక్ట్‌ అవుతారని మేకర్స్ చెబుతున్నారు. సత్యరాజ్‌, వసంత్‌ రవి కీలక పాత్రల్లో గుహన్‌ సెన్నియ్యప్పన్‌ రూపొందించిన చిత్రం ‘వెపన్‌’. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news