ఒకే విమానంలో నీతీశ్‌, తేజస్వి.. కీలక భేటీల వేళ ఆసక్తికర పరిణామం

-

ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 272  సీట్ల మెజార్టీ మార్కును దాటలేకయింది. మరోవైపు విపక్ష ‘ఇండియా’ కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ఈ తరుణంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈరోజు రెండు పక్షాలు కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిహార్‌ సీఎం, జేడీయూ అగ్రనేత నీతీశ్‌ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒకే విమానంలో దిల్లీకి బయల్దేరడం గమనార్హం. వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే విమానంలో ప్రయాణించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. నీతీశ్ ఇండియా కూటమితో మళ్లీ చేతులు కలుపుతారా అన్న పుకార్లకు ఈ సంఘటన మరింత ఊతమిచ్చింది.

ఇదిలాఉంటే మంగళవారం ఫలితాల వేళ జేడీయూ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్డీయే బ్లాక్‌లోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో చేరుతుందనే ఊహాగానాలను తిప్పికొట్టారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కూటమిలో టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news