AP: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్..!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆయన పార్టీ బరిలోకి దిగిన ప్రతిస్థానాన్ని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేనానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని చూసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి, కీలకమైన మంత్రి పదవి వస్తుందని తెలుస్తోంది. అయితే జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో మాత్రం ఈ అంశం నిరాశ కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news