ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవన్ లో ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఇందులో మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తర్వాత మోడీ తనకు మూడో సారి అవకాశం కల్పించినందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.సౌత్ ఇండియాలో ప్రజలు ఎన్డీఏను అక్కున చేర్చుకున్నారని మోదీ తెలిపారు.
8 రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్విప్ చేసిందని గుర్తు చేశారు.ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. ‘తమిళనాడులో సీట్లు గెలవకున్నా ఎన్డీఏ ఓట్ షేర్ భారీగా పెరిగింది. భవిష్యత్తులో అక్కడ మనం కొత్త చరిత్ర రాయబోతున్నాం’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.కాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 17+2, తెలంగాణలో 8 స్థానాలు వచ్చాయి.