కమల్ హాసన్ .. శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్ గా ఇది రూపొందింది.
ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియాభవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రాస్తుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ‘తాతా వస్తాడే’ పాటను సోషల్ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేసింది. హీరో పాత్రను హైలైట్ చేసే ఈ లిరికల్ వీడియో సాంగ్ లో సిద్దార్థ్, ప్రియా భవానీ తమ డ్యాన్స్ తో అలరించారు. ఈ సాంగ్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.