రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ నరేంద్ర మోడీ అయ్యారు. ఎన్డీఏ పక్ష నేతలతో కలిసి శుక్రవారం రాష్ట్రపతి భవన్ కి వెళ్లిన మోడీ.. తనను లోక్ సభ పక్షనేతగా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్నుకున్న తీర్మానాన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మోడీ రాష్ట్రపతిని కోరారు.
ఎన్డీఏ మిత్ర పక్షాల తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము మోడీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి సాయంత్రం మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.