ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయంపై 3పేజీల లేఖ రాశారు. అంతేకాదు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను కూడా లేఖకు జోడించి రాజధాని రైతులు మోదీకి పంపించారు. ఏపీకి మూడు రాజధానులు నిర్ణయం పై ప్రధాని జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పెద్ద సంఖ్యలో లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు రాజధాని రైతులు.
కాగా, అమరావతిలో మూడు రాజధానుల ప్రకటనపై రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు ఈ ఆందోళనల్ని మరింత ఉధృతం చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలకు దిగుతున్నారు. వీరికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.