తమలపాకు మరిగించిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో

-

కూరల్లో వాడే కరివేపాకునే చాలా మంది తీసి పక్కన పడేస్తుంటారు..ఇక పూజలో మాత్రమే వాడి తమలపాకును మాత్రం ఏం పట్టించుకుంటారు చెప్పండి. కానీ మీకు తెలుసా..?తమలపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం పూజలో మాత్రమే వాడే పదార్థం కాదు. దీన్ని మీరు కరెక్టుగా వాడితే వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు, షుగర్‌, బీపీ కంట్రోల్‌ చేసుకోవచ్చు, కొవ్వు కరిగించుకోవచ్చు, మలబద్ధకం సమస్యను పోగొట్టుకోవచ్చు. ఓర్ని ఇన్ని లాభాలు ఉన్నాయా అనుకుంటున్నారా..? అవునండీ..!!
తమలపాకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ మరియు కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. తమలపాకును నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తమలపాకు కాచిన నీటిని తాగడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి తమలపాకులను ముక్కలుగా వేయాలి. నీటిని 5 నుండి 7 నిమిషాలు మరిగించి, వడగట్టిన తర్వాత త్రాగాలి.

ఆరోగ్య ప్రయోజనాలు:

మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ తమలపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది.
తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. ఇది జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
తమలపాకు నీరు మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడమే కాకుండా మధుమేహం యొక్క సమస్యలను కూడా తగ్గిస్తుంది.
తమలపాకు నీరు చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యవంతంగా చేస్తుంది.తమలపాకు దాని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ఆస్తమాను అదుపులో ఉంచుతుంది. తమలపాకులను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా తమలపాకులు నివారిస్తాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా తాగాల్సిందే.రోజూ ఉదయాన్నే ఒక కప్పు తమలపాకు మరిగించిన నీళ్లు తాగండి. హెల్తీగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news