ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్ షీటు దాఖలు..!

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు  రోజు రోజుకు  సంచలనం రేకేత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.  ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ లో ఈ విషయాలను పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, రియల్టర్లు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ ఇష్యూని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సస్పండెడ్ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, సస్పెండెడ్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారమే పోలీసులతో రివ్యూ నిర్వహించారు. సీఎం అధికారులతో భేటీ అయిన మరుసటి రోజే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news