ఏపీలో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి సొంతంగా 135 చోట్ల గెలుపొందింది. దీంతో మంత్రి పదవుల కేటాయింపు కష్టతరంగా మారింది. 21 స్థానాల్లో గెలిచిన జనసేనకు మూడు మంత్రి పదవులు, ఎనిమిది స్థానాల్లో గెలిచిన బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించాల్సి వచ్చింది.
అయితే.. దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు పార్టీలో, ప్రభుత్వంలో విశేష ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడును కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుకు మంత్రిపదవి ఇచ్చారు. ప్రస్తుతం అయన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగాను ఉన్నారు. ఎర్రన్నాయుడు అల్లుడు (కూతురు భవాని భర్త) వాసు ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. భవాని సైతం ఎమ్మెల్యేగా పనిచేశారు.