డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు !!

-

తిరుమలలో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శన అవకాశం ఉంటుంది. అయితే, ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వీటిని రద్దుచేసింది. డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు కొత్త సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. దాతలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుంచి 7 వరకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది.తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు వీలుగా ఉచిత బస్సుల సంఖ్యను టీటీడీ పెంచనుంది.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news