తమిళనాడులో విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. ఇంకా వివిధ ఆసుపత్రిలో చికిత్స 40 మంది చికిత్స పొందుతున్నారు. మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఆగ్రహంతో సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు. చికిత్స పొందుతూన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది. కల్లకూరిచి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. రాష్ట్రంలో కల్తీసారా అడ్డాగా మారిందని మాజీ సీఎం పళణి స్వామి విమర్శించారు.
ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.