AP RTC ఒక హాఫ్ బాయిల్డ్ లాగా ఉందని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పండిట్ నెహ్రూ బస్టాండు లో సౌకర్యాలు పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి…మహిళలకు ఫ్రీ బస్సు అమలు విషయం సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… సమస్యలపై చర్చించి ఏపీఎస్ఆర్టీసీ ని అభివృద్ధి చేస్తామన్నారు. మెరుగైన బస్సులు సంస్ధకు అందించడానికి పని చేస్తామని వివరించారు.
ఏపీఎస్ఆర్డీసీ ఒక హాఫ్ బాయిల్డ్ లాగా తయారైంది… కొత్త బస్సులు కొంటాం.. కచ్చితంగా బస్సులు ఉంటేనే సంస్ధ నడుస్తుందని వెల్లడించారు. మహిళలకు ఫ్రీ సర్వీసు అంటూ ఏదో ఒక బస్సులో సర్వీసు కాకుండా అన్ని మంచి బస్సులే ఇస్తాం..పాత బస్సులు ఉన్న మాట వాస్తవం.. దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటామని వివరించారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఉద్యోగులకు జీతం, ఉద్యోగం ఏపీ ప్రభుత్వం అనే ఒకే గొడుగు కిందకు తెచ్చి పూర్తి విలీనం చేస్తామని ప్రకటించారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.