మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికు కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ హైస్కూల్ నూతన బిల్డింగ్ ప్రారంభం అంశంలో రాజకీయ చిచ్చు నెలకొంది. బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ట్రస్ట్, ప్రభుత్వ సంయుక్త నిధులతో నిర్మాణం అయింది తాడూర్ హైస్కూల్ నూతన బిల్డింగ్. అయితే… బిల్డింగ్ పూర్తి అయినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు హై స్కూల్.
దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ వక్ర బుద్దేనని విద్యార్థులు, స్థానికులు అంటున్నారు. స్కూల్ భవనంపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ట్రస్ట్ పేర్లు ఉండడంతో ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లో ఉదయం 9 గంటల నుంచి గం.1.00ల వరకు హై స్కూల్ విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కాలేజీ పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. అయితే… రాజకీయాలకు పోయి స్కూల్ భవనం ప్రారంభోత్సవం ఆలస్యం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ఒక మెట్టు దిగాలని అంటున్నారు.