జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా కడప జిల్లాలోని తన సొంత నియోజకర్గం అయిన పులివెందులకు బయలు దేరిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే  మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కి తృటిలో  ప్రమాదం తప్పింది.

కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా జరిగింది ఈ ఘటన. కడప జిల్లాలోని  నరసరామ్ పల్లి సమీపంలో జగన్ చూసేందుకు  ప్రజలు ఎగబడ్డారు. ప్రజల కోసం అకస్మికంగా  జగన్ కాన్వాయ్ ఆగింది.  ఈ క్రమంలోనే కాన్వాయ్ లో ఉన్న ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రైవేట్ వాహనం ఢీ కొట్టింది. దీంతో పెద్ద ప్రమాదమే జరిగిందని అందరూ భావించారు. అక్కడ ఊహించనంత ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత తిరిగి మళ్లీ పులివెందులకు బయలు దేరారు మాజీ సీఎం జగన్. కొంత మంది ప్రజలతో కూడా కొద్ది సేపు మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news