కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి దయాకర్ రావు..క్లారిటీ ఇదే

-

ఎన్నికల ఫలితాల పై సమీక్ష చేసుకున్నామని.. పార్టీ మారడం పై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారడం లేదని.. ఆ ఆలోచన కూడా లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ని సీఎం చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ఓటమితో   కొద్దిగా బాధతో ఉన్నామని తెలిపారు.

రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలన్నారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది..రైతులను మోసం చెయొద్దన్నారు. తెలంగాణ లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్  హయాం లో రైతులకు ఎలా మేలు జరిగింది అనేది రేవంత్ ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టు ల నిర్వహణ ను గాలికి వదిలేశారని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news