విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీ, కుమారుడు మృతి

-

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క కరిచి తండ్రీ, కుమారుడు మృతి చెందారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలోని భీమిలి జోన్‌ ఎగువపేటలో జరిగింది. ఇంట్లోని పెంచుకుంటున్న కుక్క తండ్రీ కుమారులను కరిచింది. అనంతరం ఆ శునకం మరణించింది. దీంతో భయాందోళనకు గురైన వారు రేబీస్ ఇంజెక్షన్ వేసుకున్నారు.

అయినా నాలుగు రోజుల క్రితం కుమారుడు మృతి చెందాడు. అదే కుక్క కరిచిన తండ్రి నిన్న  మరణించాడు. పెంపుడు కుక్క ప్రాణాలు తీయడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆ కుక్కకు ఏదైనా వ్యాధి సోకడం వల్ల అది కరిచిన తర్వాత ఇద్దరు మరణించారా లేకా ఇంకేమైనా జరిగిందా అనే విషయం తెలియ రాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల వీధి కుక్కల దాడిలోనే కాకుండా ఇలా పెంపుడు శునకాల దాడిలోనూ చనిపోతున్న కేసులు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news