Telangana : సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

-

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె విరమించారు. బుధవారం ప్రభుత్వంతో జరిపిన రెండో దఫా చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హామీ మేరకు వెనక్కి తగ్గారు.

కాగా, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో వసతి గృహాల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు పునరుద్ధరించాలని జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.

ఉస్మానియా ఆసుపత్రిలో మాత్రం జూడాలు సమ్మె కొనసాగించారు. దీంతో ప్రభుత్వం మరోసారి ఉస్మానియా జూడాలతో చర్చలు జరపగా , అవి సఫలీకృతం కావడంతో ఉస్మానియాలోనూ జూడాలు సమ్మెను విరమించారు.

Read more RELATED
Recommended to you

Latest news