ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కోమటిరెడ్డి

-

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై డిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ”జాతీయ రహదారులకు సంబంధించి గత అయిదేళ్లలో తెలంగాణకు అతి తక్కువ నిధులు వచ్చాయి అని తెలిపారు. భూసమీకరణ, ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది అని దాంతో పనులు ఆగిపోయాయి అని విమర్శించారు. 2016లో ప్రకటించిన రీజినల్‌ రింగ్‌రోడ్డును మరిచిపోతే మా ప్రభుత్వం వచ్చిన తరువాత కదలిక తీసుకొచ్చాం అని అన్నారు.

యుటిలిటీ ఛార్జీలను తామే భరిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ భరోసా ఇచ్చారు అని తెలిపారు. 50-50 షేరింగ్‌లో భూసమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించాం. 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరమైన 6 లేన్‌ గురించి కూడా చర్చించాం అని అన్నారు. రెండేళ్లలోపే విజయవాడ-హైదరాబాద్‌ మార్గాన్ని రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయనున్నామని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. అన్ని వినతులపై కేంద్రమంత్రి నితీష్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.నత్తనడకన సాగుతున్న ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని కోమటిరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news