విజయవాడ-హైదరాబాద్ ఆరు లైన్ల రోడ్‌కు త్వరలో టెండర్లు :మంత్రి కోమటిరెడ్డి

-

విజయవాడ-హైదరాబాద్ ఆరు లైన్ల రోడ్‌కు త్వరలో టెండర్లు పిలుస్తున్నామని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖామాత్యులు నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ…“హైదరాబాద్ – విజయవాడ” NH-65 రోడ్డు ఆరు లేన్లుగా నిర్మించేందుకు..వెంటనే BOT కన్సెషనరీ M/s GMR సంస్థ వివాదాన్ని పరిష్కరించి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని గడ్కరీ గారికి వివరించగా.. వారు తక్షణం స్పందించి.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని.. రాబోయే మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.

komatireddy

ఉప్పల్ – ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనులు గత 4 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న విషయం నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు తక్షణం స్పందించి.. ఈ కాంట్రాక్ట్ ను ఫోర్ క్లోస్ చేసి కొత్త టెండర్లు పిలిచి పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇక రాష్ట్ర భవిష్యత్తును మార్చే “రీజినల్ రింగ్ రోడ్డు”(ఆర్ఆర్ఆర్) కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తానని గత సమావేశంలో చెప్పినట్టుగానే.. ఈ రోజు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని సమీక్షిస్తానని నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగిందని వెల్లడించారు. NH-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ (DPR)ను త్వరితగతిన పూర్తిచేయాలని కోరగా… వారు వెంటనే DPR ను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news