గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైనవి… మంత్రి పొంగులేటి పైర్

-

గత ప్రభుత్వంలో పద్మశ్రీ రామచంద్రయ్యను సన్మానించి అండగా ఉంటామని చెప్పారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ, పేదల ప్రభుత్వం వచ్చిన సందర్భంలో దురదృష్టవశాత్తూ అనారోగ్య రీత్యా పద్మశ్రీ అందరికీ దూరమయ్యారు..గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైనవి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. పద్మశ్రీ పట్ల గత ప్రభుత్వం మాటలకి పరిమితమైందే తప్ప చేతులతో ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోవటం బాధాకరం అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు ప్రకటించిన గత ప్రభుత్వం ఆదుకోలేదు అని ఆరోపించారు. ఇక, గత ప్రభుత్వం హామీలను పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు అమలు పరచి రామచంద్రయ్యకు ఇవ్వకపోవడం బాధాకరం అని రెవెన్యూ శాఖ మంత్రి అన్నారు. సీఎంతో మాట్లాడి కొత్తగూడెంలో 462 గజాల స్థలాన్ని ఇచ్చే విధంగా జిల్లా అధికారులకు ఆదేశించాను.. పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్యకు ఆనాటి ప్రభుత్వం చేసిన వాగ్దానం ఈనాటి ప్రజా ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు డాక్యుమెంట్స్ సిద్ధం చేసి నెరవేర్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రామచంద్రయ్య విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు పరిమితమైన అంశాలన్నీ ఈ ప్రభుత్వంలో ఆదుకోవడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news