హైదరాబాద్‌లో మరో రెండు హత్యలు..తెలంగాణ హోం మంత్రి ఎక్కడా?

-

హైదరాబాద్ వరుసగా హత్యలు జరుగుతున్నాయి. హైదరాబాదులో మరో రెండు హత్యలు జరిగాయి. వరుస హత్యలతో భయాందోళనలో హైదరాబాద్ ప్రజలు ఉన్నారు. ఇవాళ నార్సింగిలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. కారులో యువకుడ్ని తీసుకొచ్చి హత్య చేశారు మహిళా, యువకుడు. యువకుడిని గొంతుకోసి చంపారు మహిళా, యువకుడు.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు గోల్కొండకు చెందిన ఇదాయత్ అలీగా గుర్తించారు.

నార్సింగి గంధంగూడలోని ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అటు చాదర్ ఘాట్ పిఎస్ పరిధి రెయిన్ బజార్‌కు చెందిన రౌడీ షీటర్ నజాబ్‌ను అర్ధరాత్రి మలక్‌పెట్ మెట్రో స్టేషన్ వద్ద హోటల్ సవేరా ముందు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో పొడిచి చంపేశారు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని వేంకటేశ్వర నగర్లో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్(40) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అయితే.. వరుసగా హత్యలు జరుగుతూంటే తెలంగాణ హొం మంత్రి ఎక్కడా పడుకున్నాడా అని హైదరాబాద్‌ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news