ఉద్యమంలో సాయిచంద్, బాలకిషన్ కేసీఆర్‌కు అడుగులో అడుగై పాటలు రాశారు: ఎమ్మెల్యే హరీష్ రావు

-

తెలంగాణ ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్ తొలి వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు .జోహర్ సాయిచంద్.. సాయిచంద్ మనల్ని వీడి అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నాం అనీ,సాయిచంద్ మరణాన్ని మనమెవరం ఊహించలేదు.. సాయిచంద్ నాకు తమ్ముడిగా, కుటుంబసభ్యుడిగా నాతో అన్ని కష్టసుఖాలు పంచుకునేవాడు అని అన్నారు.ఉద్యమంలో సాయిచంద్‌తో కలసి తెలంగాణలో వేల కిలోమీటర్లు ప్రయాణించాం.. అతనితో అంత ఆత్మీయ అనుబంధం ఉంది .సాయిచంద్ భౌతికంగా మన మధ్యలేకపోయినా తెలంగాణ ప్రజలందరి హృదయాల్లో ఉన్నాడు.సాయి మాట, పాట ప్రవహించే నదిలా ఉండేది.. ఆ గళం గలగలపారే నది, పాటలు, మాటలు అద్భుతంగా వచ్చేవి అని తెలిపారు.

సాయి లేకుండా కేసీఆర్ సభ ఉండేది కాదు.. ఆయన కేసీఆర్‌కు చాలా దగ్గర ఉండేవాడు.ఉద్యమంలో సాయిచంద్, బాలకిషన్ కేసీఆర్‌కు అడుగులో అడుగై పాటలు రాశారు అని అన్నారు.తెలంగాణ ఉద్యమానికి సాయిచంద్ చేసిన దోహదం మాటల్లో చెప్పలేనిది, వెలకట్టలేనిది.రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అని పాడుతుంటే లక్షల మంది కన్నీళ్లు పెట్టునేవాళ్లు.. సాయిచంద్ జీవించి ఉంటే తప్పకుండా చట్టసభలో అడుపెట్టేవాడు.ఒక గొప్ప నాయకుడిని కళాకారుడిని బీఆర్ఎస్, తెలంగాణ సమాజం కోల్పోయింది.మొన్నటి ఎన్నికల సభల్లో సాయిచంద్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.తెలంగాణ రావాలని, ప్రజల కష్టాలు తీరాని సాయిచంద్ ఎంతో కష్టపడ్డాడు.సాయిచంద్ భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు మేం అండగా ఉంటాం అని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news