తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు . తెలుగుదేశం పార్టీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు.
మీ అందరి కష్టం వల్లే తాను ఎంపీగా గెలిచానని,ఇంత భారీ విజయంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు కేశినేని చిన్ని. శక్తి వంచన లేకుండా అభివృద్ధి కోసం పని చేస్తానని ,ఉడతా భక్తిగా తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు కేశినేని చిన్ని . బుద్ధా వెంకన్న, తన లాంటి వాళ్లు మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరేది మాట్లాడబోమని పేర్కొన్నారు.మాకు ఏదనిపిస్తే అదే ఓపెన్‌గా చెబుతామని అన్నారు.బుద్దా వెంకన్న ఆయన సీటు కన్నా.. తన సీటు కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. అంతేకాకుండా నాగుల్ మీరా కూడా తన కోసం పని చేశారన్నారు.