ఏపీలో నేటి నుంచే పెరిగిన పెన్షన్ల పంపిణీ.. ఎవరికి ఎంతంటే?

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు… చంద్రబాబు ప్రభుత్వం అందింపజేసి వార్త చెప్పింది. ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్దం చేశారు. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేసేందుకు సిద్ధమైంది.

వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పింఛను అందించనుంది తెలుగుదేశం ప్రభుత్వం. దివ్యాంగులకు రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 చేసిన కూటమి ప్రభుత్వం… ఇతరులకు 4000 పింఛన్ అందించనుంది.

ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు ఖర్చు కాబోతుంది. పింఛన్ల కోసం రూ.4,408 కోట్లు ఒక్క రోజులో పంపిణీ చేస్తున్న ప్రభుత్వం… అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news