ఈనెల 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు సీఎం చంద్రబాబు

-

ఈనెల 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ భవన్‍కు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ సందర్భంగా టీ.టీడీపీ నేతలతో సమావేశంకానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

CM Chandrababu visited NTR Trust Bhavan on 7th of this month

టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం , పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలు పై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి హోదా లో చంద్రబాబు నాయుడు రాక తో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.

ఇక అటు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ గడుపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఏపి సిఎం చంద్రబాబు. ఇవాళ ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈఓ సమావేశంలో ఏపి సిఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి అవుతారు ఏపి సిఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news