మరమ్మత్తుల కోసం త్రవ్వి వదిలేసిన గుంత.. ముగ్గురి ప్రాణాలకు ముప్పు..!

-

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు నుంచి బీరిశెట్టి గూడెం వైపు వెళ్తున్న ఆటోలో డ్రైవర్‌ తో కలిసి ఆరుగురు ప్రయాణిస్తున్నారు. దంతాలపల్లి శివారు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పై బీటీ దెబ్బతినడంతో మరమ్మతులు కోసం తవ్వి వదిలేసిన గుంత వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఆటో ఈ గుంతను తప్పించే క్రమంలో మరిపెడ నుంచి దంతాలపల్లి వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో తొర్రూరు మండలం వెల్లికట్టకు చెందిన ఆటో డ్రైవర్‌ మల్లేశ్‌ (38), దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెంకు చెందిన పగిండ్ల కుమార్‌ (38) , వాల్యాతండాకు చెందిన భూక్యా నరేష్‌ (28) అక్కడికక్కడే మృతి చెందారు. అదే ఆటోలో ఉన్న ఉన్న కుమార్‌ భార్య మంజుల, కుమార్తె అంజలి తీవ్రంగా గాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news