తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారన్న వైఎస్ జగన్ ఆరోపణలపై టీడీపీ మండిపడింది. ‘జగన్ మాటలకు బాబాయ్ వివేకానంద రెడ్డి ఉలిక్కిపడ్డాడు. గొడ్డలి వేట్ల గాయాలు ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఒరిజినల్ వైఎస్ఆర్ అభిమానులు, జగన్ నకిలీ ఫ్యాన్స్.. వారిలో వారే కొట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అని, తెలుగుదేశం పార్టీని హెచ్చరించే ముందు ఓ సారి నీ చెల్లి పంపించిన అద్దంలో ముఖం చూసుకో జగన్’ అని ట్వీట్ చేసింది.
కాగా, రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నిన్న కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన జగన్.. వైసీపీకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదని, శిశుపాలుడి పాపాల మాదిరిగా బాబు పాపాలు పండుతున్నాయని జగన్ మండిపడ్డారు.