మరోసారి తెరపైకి కిడ్నీ రాకెట్.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన కిడ్నీల అమ్మకం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దీనిపై పోరాటం చేయడంతో ఈ కిడ్ని రాకెట్ ఆగడాలు కనుమరుగయ్యాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరోసారి కిడ్నీ రాకెట్ తెరమీదకు వచ్చింది. మధుబాబు అనే యువకుడికి రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపీ కిడ్ని ని ఆపరేషన్ చేసి తీసుకున్నారని.. ఆ తర్వాత ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆటో డ్రైవర్ ద్వారా కిడ్నీ దానం చేస్తే భారీగా డబ్బులు వస్తాయని తెలుసుకుని.. ఫేస్ బుక్ ఉంచిన వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకు మీ బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అవుతున్న వ్యక్తికి కిడ్నీ కావాలని డోనేట్ చేయడానికి సిద్ధంగా ఉంటే విజయవాడకు రావాలని భాషా అనే వ్యక్తి ఫోన్ చేశాడు. అతను గతంలో కిడ్ని దానం చేశానని చెప్పాడని, భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని వివరాలు తెలిపాడు. అనంతరం తన కిడ్నీ అవసరం ఉన్న వాళ్లకు తగ్గట్టు తన చిరునామా మార్చి విజయ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి కిడ్ని తీసుకున్నారని అనంతరం తనకు ఇస్తామని చెప్పిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధుబాబు పోలీసులకు ఇచ్చిన విజయ హాస్పిటల్ డాక్టర్ శరత్ బాబు, మధ్యవర్తిగా వ్యవహరించిన బాషాపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news