ఆ గేమ్ లో కెసిఆర్ నాలుగో స్తంభం.. బీఆర్ఎస్ పై ఫైర్ అయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

-

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తాను వెనుకుండి ఓ వైపు వైసీపీ మరో వైపు తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి 4 స్తంభాల ఆట ఆడినట్లుగానే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ గేమ్ ఆడబోతున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..బీజేపీ తెలంగాణలో టీడీపీని ముందు పెట్టి ఆట ఆడాలని చూస్తే దానికి జనసేన అండగా ఉండబోతున్నదని అన్నారు. వీరికి బీఆర్ఎస్ జతకట్టే అవకాశం ఉందని తెలిపారు. జైల్లో ఉన్న కూతురి బెయిల్ కోసం బీజేపీతో చేతులు కలిపి కేసీఆర్ వారికి నాలుగో స్తంభం గా మారుతారా? లేక కూతురుపై ప్రేమను కాదనుకుని బీజేపీని విభేదించి రాకీయాలు చేస్తారా అనేది తేలాల్సి ఉందని అన్నారు.

ఏ తండ్రికైనా కూతురిపై ప్రేమ ఉంటుందని ఇది తప్పేమి కాదని అన్నారు.రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఈసారి చాలా తెలివిగా విభజన సమస్యల పరిష్కారం పేరుతో ప్రభుత్వ పరంగా తెలంగాణ గడ్డపై ఎంట్రీ ఇచ్చారని అన్నారు. గతంలో చంద్రబాబు తెలంగాణకు వస్తే ఎవరికి తెలిసేది కాదని తెలిపారు. సీఎంల భేటీని ఈ భేటీని కేంద్ర మంత్రి బండి సంజయ్ సమర్థించడం ద్వారా బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య గేమ్ ఉందనడానికి సిగ్నల్ ఇచ్చినట్లైందన్నారు. అయితే బండి సంజయ్ మాట్లాడింది మిస్ ఫైర్ అయితే దానిని సమర్థించుకోవడానికి ఈ విషయంలో కిషన్ రెడ్డి మౌనంగా ఉన్నట్లుగా తనకు తోస్తున్నదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news