సెల్ ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య..!

-

సాధారణంగా ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ సెల్ ఫోన్ ని వినియోగిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్ను వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్  లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సెల్ ఫోన్  లేకుండా ఓ గంట సేపు ఉన్నారంటే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాళ్లు కూడా ఉన్నారు. సెల్ఫోన్ చేతిలో ఉంటే లోకాన్నే మరిచిపోతారు. రోజురోజుకు జనాల్లో సెల్ఫోన్ పిచ్చి పెరిగిపోతోంది. తాజాగా ఓ యువకుడు సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మేస్త్రం కృష్ణ సెల్ ఫోన్  కొనివ్వాలని తన తల్లిదండ్రులు అడిగాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అతడిని మందలించారు. సెల్ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 3న మేస్త్రం కృష్ణ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఊరికి చివరన ఉన్న గుట్టపైన చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఈ విషయాన్ని ఇవాళ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కు యువకులు బానిసలవుతున్నారని.. అందుకే కొనివ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news