వైఎస్‌ ఉండిఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు :సీపీఐ జాతీయ కార్యదర్శి

-

రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలక్షణమైన వ్యక్తి అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కొనియాడారు. అమరావతిలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు బిళ్ల పెట్టుకుని తిరుగుతున్నారు.. రాజకీయ నాయకులు పూటకో పార్టీలో ఉంటున్నారు.. కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డికు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారని.. రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తిగా నారాయణ అభివర్ణించారు.

ఇక, డబుల్‌ ఇంజిన్ సర్కార్ పై మరింత పోరాటం చేయాలని సూచించారు నారాయణ.. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే నష్టం అని ఆరోపించారు.. ప్రమాదకరమైన బీజేపీతో చంద్రబాబు ఉన్నారు.. మరోవైపు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఇక, కమ్యూనిస్టులపై వైఎస్‌కు మంచి అభిప్రాయం ఉందన్నారు.. అంతేకాదు.. అది నిరూపించారని కూడా నారాయణ గుర్తుచేశారు. కొందరు నేతలు మనం మంచిగా ఉన్నప్పుడే పలకరిస్తారు.. లేకపోతే పక్కకు పోతారు.. కానీ, వైఎస్‌ అలాంటి వ్యక్తి కాదు.. ఎవరైనా కలిస్తే.. పరిస్థితి ఏంటి? అని ఆరా తీసి.. సహాయం చేసేవారని గుర్తు చేశారు. అయితే, వైఎస్‌ ఉండిఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news