బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మీద చేయి చేసుకున్నారు పోలీసులు. డీఎస్సీ అభ్యర్థులను నిర్బంధించిన తెలంగాణ పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా… బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మీద చేయి చేసుకున్నారు. వారికి మంచి నీళ్ళు తీసుకుని వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పై పోలీసులు అటాక్ చేశారు. దీంతో కాంగ్రెస్ సర్కారు డౌన్ డౌన్ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇక అటు అర్దరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆందోళన చేశారు DSC అభ్యర్థులు. తమ నిరసనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, తాము స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నామని తెలిపారు DSC అభ్యర్థులు. నిరుద్యోగులు అందరం తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్దరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటు అంటూ DSC అభ్యర్థులు ఆగ్రహించారు. ఇక DSC అభ్యర్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి..ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు.