అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసినట్లు మాజీ మంత్రి జోగి రమేశ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసులతో తనను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. “ఇవాళ నా మీద కేసు పెట్టడానికి తహతహలాడుతున్నారు. రండి.. కేసులు పెట్టుకోండి. అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అనుకుంటున్నారు. రెడ్ బుక్ తీస్తావో.. ఏం చేస్తారో చేయండి. మమ్మల్ని చంపించాలని అనుకుంటున్నారు’’ అంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు.
సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారు…. సీజ్ చేసిన భూమి నెంబర్ పై అమ్మకాలు జరగవని వెల్లడించారు. లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎలా అయినా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనీ చూస్తున్నారని ఆగ్రహించారు. మహా అయితే అరెస్ట్ చేసి 2,3 నెలలు జైల్లో పెడతారు అంతే కదా అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.