మా దేశంలో పర్యటించండి.. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్ కు మాల్దీవులు ఆహ్వానం

-

గత కొంతకాలంగా భారత్, మాల్దీవుల మధ్య టెన్షన్ వాతావరణం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్‌తో కయ్యం పెట్టుకొని కుదేలైన మాల్దీవులు తన పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే విశ్వప్రయత్నాలు చేస్తూ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు ఆ దేశం భారత్కు ఓ వినూత్న ఆహ్వానం పంపింది. అదేంటంటే?

టీ20 ప్రపంచ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టును తమ దేశంలో పర్యటించాలని మాల్దీవులు ఆహ్వానించింది. ఈ మేరకు మాల్దీవుల మార్కెటింగ్‌-పబ్లిక్‌ రిలేషన్స్‌ కార్పొరేషన్‌, మాల్దీవుల అసోషియన్‌ ఆప్‌ టూరిజం ఇండస్ట్రీ  సంయుక్తంగా టీమ్ ఇండియాను ప్రత్యేకంగా ఆహ్వానించాయి. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన రోహిత్‌ సేనకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము ఎదురు చూస్తున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. మాల్దీవులు, భారత్‌ మధ్య బలమైన సాంస్కృతిక, క్రీడా సంబంధాలకు ఈ ఆహ్వానం ఓ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత క్రికెట్‌ జట్టును స్వాగతించడం, వారి ఆనందంలో భాగం కావడం తాము గొప్ప గౌరవంగా భావిస్తామని వారంతా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news