విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు : సుప్రీంకోర్టు

-

ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీం కోర్టు బుధవారం రోజున (జులై 10వ తేదీ 2024) కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్‌, జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పు ఇస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరూ భరణం కోరవచ్చని స్పష్టం చేసింది. భార్యకు భరణం పొందే చట్టబద్ధమైన హక్కు సెక్షన్ 125 కల్పించిందని, ఇది ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని దేశ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news