తెలంగాణలో ఎదిగేందుకు ఇదే సరైన సమయం…బీజేపీలో ఎందుకో సైలెన్స్

-

గతంతో పోలిస్తే తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్ చాలా వేగంగా పెరిగింది. ఒక్క‌టంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్న చోట ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా 4 స్థానాల నుండి 8కి ఎగ‌బాకింది.చాలా మంచి హైప్ వచ్చింది ఆ పార్టీకి.బీఆర్ఎస్ సున్నా సీట్ల‌తో చతికిల ప‌డి ఇప్పుడు కాంగ్రెస్ ఆకర్ష ప్రభావంతో ఖాళీ అవుతున్న స‌మ‌యంలో బీజేపీ సైలెన్స్ మోడ్ ఉండిపోయింది.బీఆర్ఎస్ నుంచి జంప్ అవుతున్న నేతలతో ఓ వైపు కాంగ్రెస్ రోజు రోజుకీ బలపడుతోంది.ఇలాంటి కీలక సమయంలో బీజేపీ సైలెంట్ గా ఉండటం క్యాడ‌ర్ ను ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది.ఎన్నికల ముందు వరకు తెలంగాణ రాజకీయాలే లక్ష్యంగా పనిచేసిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లాడాన్ని కేడర్ ప్రశ్నిస్తోతోంది.

బండి సంజ‌య్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ మంచి ఊపులో ఉండేది. అధ్య‌క్ష ప‌ద‌వి నుండి సంజయ్ ను త‌ప్పించ‌టాన్ని యాక్టివ్ గా ఉన్న క్యాడ‌ర్ కు, కొంతమంది నేత‌ల‌కు ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నారు. ఆయన్ని తప్పించడం ఇష్టం లేదని ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు.ఆయన స్థానంలో కిష‌న్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసిన ఆశించిన స్థాయిలో కేడర్ ఉత్సాహంగా లేదని తెలుస్తోంది. కిషన్ రెడ్డి సాఫ్ట్ అనేది అంద‌రికీ తెలుసు. ఎన్నిక‌ల‌య్యాక‌, కిష‌న్ రెడ్డికి మంచి ప్రయారిటీ ఉన్న మినిస్ట్రీ వ‌చ్చాక ఆయ‌న తెలంగాణ బీజేపీని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. ఢిల్లీలోనే ఎక్కువ స‌మ‌యం ఉంటున్నారు.అంతేకాకుండా ఇటీవల కిషన్ రెడ్డికి జమ్మూకాశ్మీర్ ఎన్నికల పరిశీలకులుగా కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం.దీంతో అసలు తెలంగాణలో పార్టీని పట్టించుకునే పెద్ద దిక్కు లేకుండా పోయింది.

బీజేపీలో ఉన్న నిబంధ‌న ప్ర‌కారం పార్టీ ప‌ద‌వి, ప్ర‌భుత్వ ప‌ద‌విలో ఒక‌రే ఉండ‌కూడ‌దు.పార్టీ అధ్యక్షుడిగా,కేంద్ర మంత్రిగా జోడు పదవులను నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. కేంద్ర క్యాబినెట్ ఏర్పాటు స‌మ‌యంలోనే అధ్య‌క్ష ప‌ద‌వి కూడా ప్ర‌క‌టిస్తార‌ని అంతా అనుకున్నారు. ఎంపీ ఈట‌ల‌కు ప‌ద‌వి రాబోతుంద‌న్న చ‌ర్చ కూడా జ‌రిగింది. కానీ, కేంద్రంలోనూ అధ్యక్షుడుగా ఉన్న న‌డ్డా సైతం ప్ర‌భుత్వంలో చేరిపోయారు కాబ‌ట్టి కొత్త జాతీయ అధ్య‌క్షుడు రావాలి. అంటే రాష్ట్రానికి కూడా కొత్త బాస్ ప్ర‌క‌ట‌న ఉండ‌బోతుంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పై పోరాడేందుకు బీజేపీ నేత‌లు ఎవ‌రూ ముందుకు రావ‌ట్లేదు. ఎల్పీ లీడ‌ర్, అధ్య‌క్షుడు, ఎంపీలు అంతా సైలెంట్ గానే ఉండిపోయారు. ఏబీవీపీ ఉన్నంత యాక్టివ్ గా కూడా పార్టీ లేకపోవడంతో కొంతమంది నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష బాధ్యతలు ఈట‌ల‌కు ఇస్తారా మ‌రో నేత‌కు అవ‌కాశం ఇస్తారా అనే సంగ‌తి అటుంచితే బీఆర్ఎస్ పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యే స్థితిలో ఉన్న నేటి పరిస్థితుల్లో బీజేపీ అవ‌కాశాలు అందిపుచ్చుకోవాలంటే కొత్త అధ్య‌క్షుడిని వెంట‌నే నియమించాల‌ని క్యాడ‌ర్ కోరుకుంటుంది.దక్షిణాదిన విస్తరించాలని ఆశిస్తున్న బీజేపీ ఇకనైనా తెలంగాణలో యాక్టివ్ కావాలని కేడర్ డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news