సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో.. ఎందుకు పెరుగుతోంది క్రైం రేట్ ?? : కేటీఆర్

-

హైదరాబాద్లో వరుస హత్యలపై, శాంతిభద్రతలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?” అని మొదటి పేజీలో వార్తలు రాస్తున్నాయంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని వ్యాఖ్యానించారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని అన్నారు. “బ్రాండ్ హైదరాబాద్” ఎందుకు మసకబారుతోందని ప్రశ్నించారు. విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ… ఎందుకింత కళ కోల్పోతోందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

“పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు పెరుగుతున్నాయి. అంతరాష్ట్ర ముఠాలు పేట్రేగిపోతున్నాయి. హైదరాబాద్లో శాంతి లేదు. నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు. సీఎం స్వయంగా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తున్నా… పోలీసింగ్ పై కమాండ్ ఏది? క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది..?? కాంగ్రెస్ పవర్లోకి రాగానే గడియ గడియకు ఏమిటీ… పవర్ కట్? సేఫ్ సిటీ గా ఉన్న మహానగరంలో ఎందుకు పెరుగుతోంది క్రైం రేట్ ?? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు” అని కేటీఆర్ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news