తెలంగాణ రాష్ట్రంలో.. గులాబీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం కోల్పోవడం ఇటు ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడం… కారణంగా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. పొద్దున లేస్తే చాలు… గులాబీ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినట్లు వార్త వినాల్సి వస్తుంది. దీంతో కెసిఆర్ కలవర పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి మరోసారి ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడు ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), రేపు అరికెపూడి గాంధీ (శేర్లింగంపల్లి) హస్తం తీర్థం పుచ్చుకొనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు లక్ష్మారెడ్డి (ఉప్పల్), సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), వివేకానంద గౌడ్ (కుత్బుల్లాపూర్) కూడా కండువా మార్చుకోబోతున్నట్లు సమాచారం.