Anant Weds Radhika : రజినీ కాంత్‌ టు ధోనీ వరకూ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న స్టార్స్‌..

-

ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్​అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చెంట్‌ తో శుక్రవారం  అంగరంగ వైభవంగా జరిగిన విష‌యం తెలిసిందే. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఈ వేడుక‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు.

రజినీ కాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌ బాబు, రణ్‌బీర్‌ కపూర్‌, సూర్య, ఎమ్‌ ఎస్‌ ధోనీ సహా పలువురు స్టార్స్‌ తమ ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్‌లో స్టార్స్‌ అంతా మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. రజినీకాంత్‌ నుంచి స్టార్‌ క్రికెటర్‌ ఎమ్‌ఎస్‌ ధోనీ వరకూ ప్రతి ఒక్కరూ బరాత్‌లో కాలు కదిపి ఆకట్టుకున్నారు. రజినీకాంత్‌, షారుక్‌ ఖాన్‌, అలియా భట్‌, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్‌ కపూర్‌, ఎమ్‌ఎస్‌ ధోనీ సహా స్టార్సంతా ఉత్సాహంగా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news