ఏపీలో బడ్జెట్‌ పై చంద్రబాబుకు యనమల సలహాలు

-

 

ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ పెట్టే అవకాశాలు ఉన్నట్లు యనమల ప్రకటన చేశారు. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సభా నిర్వహణ విషయంలో కీలకాంశాలను ప్రస్తావించిన యమమల…. పూర్తి స్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి వాటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు.

Yanmala’s advice to Chandrababu on budget in AP

ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుందని.. గడువు ముగిసేలోగా బడ్దెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సుకు ఆమోదం లేకుంటే ప్రభుత్వం ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేయలేదన్నారు.

పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమో లేక ఓటాన్ అకౌంట్ ఆమోదించడమో చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే ఆలోచన ఉన్నట్టు కన్పిస్తోందని తెలిపారు. ప్రస్తుతమున్న సభ ప్రొరోగ్ చేయలేదు కాబట్టి.. ఆర్డినెన్స్ జారీ చేయడం కుదరదని చెప్పారు యనమల. ఈ పరిస్థితుల్లో సభలో పూర్తి స్థాయి బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ పెట్టి ఆమోదించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news