బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాతో బీ కేర్ ఫుల్.. వ్యాధి సోకితే 97 శాతం మరణాలు

-

మెదడు తినే అమీబా (బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా)తో కేరళలో ఇటీవలి కాలంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులు ఇప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నీరు నిల్వ ఉండే చెరువులు, కుంటలు, శుభ్రం లేని స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈత కొట్టడం లాంటివి చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చోట మెదడు తినే అమీబా(అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌) పెరుగుతుందని తెలిపారు.

ఈత కొట్టడం లేదంటే స్నానానికి దిగి మునిగినప్పుడు అమీబా ముక్కు ద్వారా మెదడులోకి చేరి అక్కడే తిష్ఠవేస్తుందని వైద్యులు తెలిపారు. మెదడు కణజాలాన్ని నాశనం చేసి, మెదడు వాపునకు కారణమవుతుందని చెప్పారు. ఈ అమీబా సోకిన వారిలో 97 శాతం మందికి పైగా మరణిస్తారని, ఎక్కువ శాతం పిల్లలపైనే ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ అమీబా బారిన పడిన తర్వాత బాధితుల్లో జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ (మెదడు వాపు) వ్యాధి మాదిరే లక్షణాలు కన్పిస్తాయని పేర్కొన్నారు.

బ్రెయిన్ ఈటింగ్ అమీబా లక్షణాలు..

  • తీవ్రమైన జ్వరం
  • తలనొప్పి
  • ఫిట్స్
  • వాంతులు
  • మెడ బిగుసుకుపోవడం
  • చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం
  • బ్యాలెన్స్‌ తప్పిపోవడం
  • మనోభ్రాంతి
  • కోమాలోకి వెళ్లి చనిపోయే ముప్పు

Read more RELATED
Recommended to you

Latest news