ఓ ఇద్దరు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. కారణం అదేనా..?

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఎక్కడా సహనం కోల్పోలేదు.. ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వాటికి నవ్వుతూనే సమాధానం చెప్పుకొచ్చారు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి.. తన క్యాబినెట్ లోని మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఫైరయ్యారట.. ప్రత్యేక సమావేశానికి పిలిపించుకుని మరీ చివాట్లు పెట్టారట.. మీరందరూ ఇలా ఉంటే ప్రభుత్వాన్ని నడపడం కష్టం, అందరూ బాధ్యతగా పనిచేయాలి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది.. ఇంతకీ ఆయన కోపానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటికి వచ్చింది..

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి.. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.. లోపాలను ఎత్తి చూపి మరి.. ఆందోళనలు చేస్తున్నాయి.. ఉద్యోగాల నోటిఫికేషన్, హైదరాబాద్ లో శాంతి భద్రతలు వంటి వాటిని హైలెట్గా చేసుకొని పదునైన ఆరోపణలు సైతం ప్రతిపక్షాలు గుప్పిస్తున్నాయి.. అయితే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఫెయిలయ్యారట.. తాను ఒక్కడినే మాట్లాడాల్సి వస్తుందని.. మీరందరూ ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డి మంత్రులను ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది.. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్యలను అంశాల వారీగా తిప్పి కొట్టడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలం అయ్యారట.

ఈ వ్యవహారంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో అయన సమావేశం అయ్యారట.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో ఎందుకు విఫలం అయ్యారని ప్రశ్నించారట .. అవసరాన్ని బట్టి అందరూ మాట్లాడాలని.. సైలెంట్ గా ఉంటే నడవదని అయన హెచ్చరించారట.. ప్రతిపక్షాల విమర్శలకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేక పోతున్నారని రేవంత్ ఓ ఇద్దరు మంత్రులని టార్గెట్ గా చేసుకొని ప్రశ్నించారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.. ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రతిపక్షాలకు దీటైన కౌంటర్ ఇవ్వాలంటూ ఆయన.. మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారట. ముఖ్యంగా కెసిఆర్ కేటీఆర్ వంటి నేతలు మాట్లాడినప్పుడు వారికి బలమైన కౌంటర్లు ఇవ్వాలని.. సబ్జెక్టు బేస్డ్ గా విమర్శలు చేయాలని సూచించారట.. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా.. సీరియస్ అవడంతో మంత్రులు ఎమ్మెల్యేలందరూ షాక్ అయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news