తెలంగాణాలో హీటెక్కిన ఫిరాయింపుల రాజకీయం..

-

ఉద్యమాల నుంచి పుట్టిన బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతోంది.. నిన్న మొన్నటి వరకు పార్టీతోనే ఉంటామని ప్రగల్బాలు పలికిన ఎమ్మెల్యే లందరూ ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు.. కాంగ్రెస్ చేసిన ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.. దింతో తెలంగాణాలో ఫిరాయింపుల రాజకీయం హీటెక్కింది.. గులాబీ పార్టీకి అండగా ఉంటున్న నేతలందరూ.. ఇప్పుడు హస్తం గూటికి వెళ్తున్నారు.. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ ఎస్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి.. లేటెస్ట్ గా చేరిన ప్రకాష్‌ గౌడ్ తో కలిసి మొత్తం ఎనిమిది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.. మరో నలుగురు కూడా రేపో మాపో హస్తం గూటికి చేరబోతున్నారని ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది.. ఈ ప్రచారమే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కోల్డ్ వార్ కి దారితీస్తోంది..

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. వచ్చే ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.. దానికి తోడు బిఆర్ఎస్ లో ఉండే ఎమ్మెల్యేలు కూడా తమ స్వలాభం కోసం కొందరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మరికొందరు గోడలు దూకుతున్నారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వారు చేసిన పనినే.. ఇప్పుడు తాము చేస్తున్నామని.. మరి కొద్ది రోజులు వెళ్తే టిఆర్ఎస్ లో ఆ నలుగురు తప్ప మరెవరో మిగలరంటూ.. సంచలన వ్యాఖ్యలను సైతం కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారంటే.. వారి కాన్ఫిడెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..

ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ ఉండడంతో ఉద్యమాలకు ఊపిరి పోసిన కేసిఆర్ కు ఇది పెద్ద సవాల్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఓవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగుతున్నప్పటికీ.. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోతున్నారట.. దీంతో బిఆర్ఎస్ ఉనికికే ప్రమాదం వచ్చి పడిందని.. సొంత పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకోవడం మొదలు పెట్టేసారట.. మొత్తంగా పార్టీ ఫిరాయింపుల రాజకీయం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news