Kitchen Tips : ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వంటగదిలో ఎంతో హడావిడి నెలకొని ఉంటుందని చెప్పాలి. ఉదయమే స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఆఫీస్ కి వెళ్లేవారు ఉంటారు కనుక హడావిడిగా వంటలు చేస్తూ ఉంటాము ఇలాంటి తరుణంలోనే వంటిల్లు మొత్తం చెత్త చెత్తగా తయారవుతూ ఉంటుంది. కొన్నిసార్లు పొరపాటున వంట చేసేటప్పుడు నూనె కూడా కింద పడిపోతూ ఉంటుంది.
ఇలా నూనె కింద పడిపోవడం వల్ల వంటిల్లు మొత్తం మరకలు అవ్వడమే కాకుండా కొన్నిసార్లు మనం జారీ కింద పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా నూనె కింద పడిపోయినప్పుడు చాలామంది దానిని శుభ్రం చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ఎంత శుభ్రం చేసిన ఆ నూనె తాలూకా మరకలు అలాగే ఉంటాయి పొరపాటున ఆ మరకలు తొక్కి వస్తే ఇల్లు కూడా అలాగే మరకలు కనపడుతూ ఉంటాయి.
ఇలా నూనె కింద పడినప్పుడు చాలా సింపుల్ గా ఈ నూనెను శుభ్రం చేయడమే కాకుండా మరకలు లేకుండా కూడా శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ సింపుల్ చిట్కా ఏంటి అనే విషయానికి వస్తే.. పొరపాటున చెయ్యి తగిలి నూనె కింద పడినప్పుడు వెంటనే ఆ నూనె మీద గోధుమపిండి చల్లాలి. ఇలా గోధుమపిండిని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి అనంతరం టిష్యూ పేపర్ లేదా కాటన్ తీసుకొని క్లీన్ చేయటం వల్ల అక్కడ ఏ విధమైనటువంటి నూనె మరకలు కూడా ఉండవు.