డ్రగ్స్‌ సిండికేట్‌తో ఐటీ కంపెనీల యజమానులు, రియల్టర్లకు లింకులు

-

అంతర్జాతీయ డ్రగ్‌ సిండికేట్‌ కేసులో ప్రముఖుల లింకులు బయటపడుతున్నాయని తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌) అధికారులు వెల్లడించారు. డ్రగ్స్‌ వినియోగదారుల్లో పబ్‌ల యజమానులు, ఐటీ కంపెనీల అధినేతలు, రియల్టర్ల పేర్లు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. అఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి వివిధ నగరాల్లో విక్రయిస్తున్న మహిళ సహా ఐదుగురు సభ్యుల ముఠాను టీజీ న్యాబ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇందులో 13 మంది వినియోగదారులను గుర్తించగా.. నిందితుల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్న సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్, అంకిత్‌రెడ్డి, మధుసూదన్, ప్రసాద్, నిఖిల్‌ ధావన్‌లను పోలీసులు నోటీసులిచ్చి పంపించేశారు. దేశంలో దాదాపు ఏడు పబ్‌లు నిర్వహిస్తున్న నిఖిల్‌ ధావన్‌ అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా సభ్యుల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. తరచు దేశవిదేశాలు తిరిగే ఇతడికి ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. మరో వినియోగదారుడు మధురాజును ప్రముఖ ఐటీ సంస్థ యజమానిగా గుర్తించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news